telugu navyamedia
తెలంగాణ వార్తలు

మతం పేరుతో విధ్వంసం సృష్టిస్తే..ఉక్కుపాదంతో అణచివేస్తాం..

కులం, మతం పేరుతో చిచ్చు పెట్టే వారిని ఓ కంట కనిపెట్టాలని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో పర్యటిస్తున్న ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.. పలు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో వారానికి రెండుమూడ్రోజులు కర్ఫ్యూ ఉండేదని గుర్తుచేసుకున్న ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. ప‌నికిమాలిన పంచాయ‌తీలు లేవన్నారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తూ ముందుకు పోతామన్నారు. కులాలు, మతాల చిచ్చులో చ‌లిమంట‌లు కాచుకునే ప్ర‌య‌త్నం ఎప్పుడూ చేయ‌లేదని చెప్పారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ప‌టిష్టంగా కాపాడుకుంటున్నామ‌ని తెలిపారు

హైదరాబాద్‌లో నీటి సమస్య లేదు, కరెంటు సమస్య లేదని అన్నారు.. న్యూ సిటీకి సమాంతరంగా ఓల్డ్ సిటీని కూడా అభివృద్ది చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.. గ‌తంలో మోజాం జాహీ మార్కెట్‌ను చూసి బాధ‌ప‌డేవాళ్లం. ఇప్పుడు మోజాం జాహీ మార్కెట్‌ను అభివృద్ధి చేశామ‌న్నారు. హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడుకుంటూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో నోటరీ ప్రాపర్టీ విషయంలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.. బహదుర్‌పురాకు జామా ఉస్మానియా వ్యవస్థాపకుడి పేరు పెడతామని ప్రటించిన ఆయన.. పాతబస్తీలో రెండు మూడు నెలలో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామని తెలిపారు.

 

Related posts