telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణకు కేంద్రం షాక్ : నెల రోజుల్లో ఏపీకు చెల్లించాల్సిన‌ విద్యుత్‌ బకాయిలు చెల్లించాలి

తెలంగాణకు కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తక్షణమే చెల్లించాలని… కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఆదేశించింది.

తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వం అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించింది. ఇటీవల ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు. దీంతో వెంటనే ఇప్పుడు కేంద్రం విద్యుత్‌ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వం అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించింది. ఇటీవల ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు. దీంతో వెంటనే ఇప్పుడు కేంద్రం విద్యుత్‌ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. విభజన చట్టం రూల్స్‌ ప్రకారం కేంద్రం ఆదేశాలతో ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది.

జూన్ 2, 2014 నుంచి జూన్ 10, 2017 వరకు పెండింగ్ లో ఉన్న రూ. 3 వేల 441 కోట్ల ప్రిన్సిపల్‌ అమౌంట్‌ తో పాటు రూ. 3 వేల 315 కోట్ల లేట్‌ పేమెంట్‌ కూడా చెల్లించాలని ఆదేశించింది.అయితే ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా ఏపీకి చెల్లింపులు చేయాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణ సీఎస్‌కు సూచించారు.

విభజన చట్టం రూల్స్‌ ప్రకారం కేంద్రం ఆదేశాలతో ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసింది. ఏపీ సరఫరా చేసిన విద్యుత్‌ 3441 కోట్లు కట్టాలి. అయితే ఏపీ జెన్‌కో ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించాలని కోరుతూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ కేసు వేసింది. అక్కడా వివాదం పరిష్కారం కాకపోవడంతో హైకోర్టులో కేసు వేసింది. ఇప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

అయితే కేంద్రం ఆదేశాలపై తెలంగాణ సర్కార్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ నుంచి తెలంగాణకు 12 వేల 900 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు.

విద్యుత్ రంగంలో కేసీఆర్‌ సాధించిన విజయాలను.. బీజేపీ సర్కార్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరాఫరాకు అడ్డంకులు సృష్టించేందుకే ఈ నిర్ణయమని జగదీష్‌రెడ్డి విమర్శించారు

Related posts