telugu navyamedia
విద్యా వార్తలు

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు…

ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్‌.వి. శేషగిరి బాబు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది విద్యార్థులు​ ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించారు.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ జనరల్‌విభాగంలో 35 శాతం పాస్‌ కాగా, ఒకేషనల్‌లో 42 శాతం ఉత్తీర్ణత సాధించారు.. ఇంటర్‌ సెకండియర్‌లో జనరల్ విభాగంలో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

కాగా.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోమని అధికారులు సూచించారు.

Related posts