telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహబూబాబాద్‌ : … బస్తీ దవాఖానాల.. ఏర్పాటు..

basti dhavakhana in mahaboob nagar

నిరుపేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని, వీటిని సద్వినియోగ పర్చుకోవాలని మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఎంతో దూరం నుంచి వైద్యంకోసం వస్తుంటారు. వారు ఇబ్బంది పడకుండా చూడాలని కూడా ఆమె విజ్ఞప్తిచేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాను ఆమె ప్రారంభించారు.మహబూబాబాద్‌ జిల్లాకు మూడు ఆరోగ్యకేంద్రాలు మంజూరు కాగా ప్రస్తుతం ఒక కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని, త్వరలో మరో రెండు కేంద్రాలను కూడా ప్రారంభించుకుంటామని అన్నారు.

మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రిని జిల్లాస్థాయి ఆస్పత్రిగా అప్‌ గ్రేడ్‌ చేసేందుకు ప్రభుత్వం 60 కోట్లుకేటాయించిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. జిల్లాకు మెడికల్‌కాలేజీ కూడా మంజూరైందని, ఇక్కడి ప్రజా ప్రతినిధుల సహకారంతో త్వరలోనే కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా కావాల్సిన సదుపాయాల్ని కల్పిస్తామని తెలిపారు. ఆశావర్కర్లకు, అంగన్‌వాడీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వారు కూడా అదేస్థాయిలో ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శివలింగయ్య, జాయింట్‌కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts