బ్రిటన్ పార్లమెంటులో అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. ఇటీవల జరిగిన ఎన్నిక్లలో ఘన విజయం సాధించిన భారతీయ సంతతి ఎంపీలు భగవద్గీత సాక్షిగా ప్రమాణశ్వీకారం చేశారు. బ్రిటన్ రాజకీయ ముఖచిత్రంపై ప్రవాస భారతీయులు చెరగని ముద్రవేశారనటానికి ఈ దృశ్యం బలమైన ఉదాహరణగా నిలిచింది. ఆగ్రాలో జన్మించిన ఆలోక్ వర్మ, ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌లు భగవద్గీతను చేతిలో పెట్టుకుని ఎంపీ బాధ్యతలను చేపట్టారు. బిట్రన్ పార్లమెంటు సాంప్రదాయాల ప్రకారం ఎన్నికైన సభ్యులు తమకు నచ్చిన పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేసే వెసులుబాటు ఉంది. దేవసాక్షిగా ప్రమాణాశ్వీకారానికి సమ్మతించని వారు ఆత్మసాక్షిగా కూడా ప్రమాణం చేయవచ్చు. కాగా చరిత్రలో మునుపెన్నడూ లేదని విధంగా తాజా ఎన్నికల్లో 65 మంది శ్వేతజాతీయేతరులు ఎన్నికయ్యారు. వీరిలో 15 మంది భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం.
ఇంగ్లాండ్ హ్యంప్‌షైర్‌లో జన్మించిన రిషి సునక్ గత ప్రభుత్వంలో ట్రెజరీ విభాగం చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. యార్క్‌షైర్‌ను ఎన్నికైన ఆయనకు ఇది ఎన్నికల్లో మూడో విజయం. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో ఆయన తన క్లాస్ మేట్ అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరో భారత సంతతి ఎంపీ అలోక్ శర్మ భారత్‌లోనే జన్మించారు. ఆ తరువాత బ్రిటన్‌లో స్థిరపడ్డారు. 2010 నుంచి ఆయన రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆయన ఇంటర్నల్ డెవలెప్‌మెంట్ సెక్రెటరీగా విధులు నిర్వర్తించారు.