telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విజయవాడ : … లలితా త్రిపుర సుందరీదేవిగా … అమ్మ ..

navaratri utsav today as lalithasundary devi

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా సాగుతున్నాయి. నేడు దుర్గమ్మ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మల్లికార్జున మహామండపంలో ఆరో అంతస్తులో ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు. టిక్కెట్టు రుసుము రూ.3వేలు నిర్ణయించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శత చండీయాగం నిర్వహిస్తారు. టిక్కెట్టు రుసుము రూ.4వేలు నిర్ణయించారు. ఆన్‌లైన్లో కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు.

సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు జగన్మాత దుర్గమ్మకు మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ రుత్వికులు సమర్పిస్తారు. ఆ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు. వేకువ జామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు కనకదుర్గానగర్‌లో లడ్డు, పులిహోర ప్రసాదాలను విక్రయిస్తారు. అర్జున వీధిలోని అన్నదానం షెడ్డులో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తారు.

Related posts