telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జైషే ఉగ్రవాది మసూద్ ఆసుపత్రి నుండే.. ఆయుధాల తయారీ.. పేలుడుతో గాయాలపాలు…

blast in hospital where terrorist masood

పాక్ ప్రేరేపిత జైషేమహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ రావల్‌పిండి ఆసుపత్రిలో జరిగిన పేలుడులో గాయపడ్డాడని సోషల్ మీడియా పోస్టులతో పాటు టెలీగ్రామ్ టీవీ చానల్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. నిషేధిత జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునేందుకు రావల్‌పిండిలోని ఆర్మీ ఆసుపత్రికి నిత్యం వస్తున్నాడని రూమర్లు వెలువడ్డాయి.

ఆసుపత్రిలో జరిగిన పేలుడులో డయాలసిస్ చేయించుకునేందుకు ఆర్మీ ఆసుపత్రికి వచ్చిన మసూద్ అజహర్‌తోపాటు మరో పదిమంది గాయపడ్డారని పలువురు పాకిస్థానీ ట్విట్టర్ ఖాతాదారులు తెలిపారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా అప్ లోడ్ చేశారు. కాని మసూద్ అజహర్ గాయపడ్డాడనే వార్తలను భారత ఇంటలిజెన్స్ విభాగం అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. దీనిపై భారత ఇంటలిజెన్స్ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోంది. రావల్ పిండి మిలటరీ ఆసుపత్రిలో జరిగిన పేలుడులో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ తో పాటు పదిమంది గాయపడ్డారని, వారు మిలటరీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని ఫస్తూన్ తహఫూజ్ మూవ్ మెంట్ మానవహక్కుల కార్యకర్త అహసన్ ఉల్లా మియాఖరీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మిలటరీ ఆసుపత్రిలోపలకు ఎవరినీ అనుమతించడం లేదని, మీడియాను కూడా బ్లాక్ చేశారని అహసన్ ఉల్లా చెప్పారు. ఆసుపత్రిలో జరిగిన పేలుళ్లలో పొగ వస్తున్న వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. పుల్వామా దాడి అనంతరం జరిగిన బాలాకోట్ పై భారతవైమానిక బృందాల దాడి అనంతరం అజహర్ ను పాకిస్థాన్ సైన్యం రక్షణలో ఉంచారు.

Related posts