telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఇక గాంధీ ఆస్పత్రి మొత్తం కరోనాకే…

karona ward in gandhi hospital

గాంధీ ఆస్ప‌త్రిని పూర్తిస్థాయిలో కోవిడ్ ఆస్ప‌త్రిగా మార్చేందుకు సిద్ధ‌మైంది ప్ర‌భుత్వం.. గాంధీ ఆస్పత్రిని రేపటి నుంచి పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.. శ‌నివారం నుంచి ఓపీ సేవ‌ల‌ను నిలిపివేయాల్సిందిగా ఇప్ప‌టికే ఆదేశించారు.. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్  కేసులకు మాత్రమే ట్రీట్మెంట్. అందించ‌నున్నారు.. ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉండ‌గా.. నిన్న ఒకేరోజు 150 మంది అడ్మిట్ అయిన‌ట్టు వైద్యులు చెబుతున్నారు.. గాంధీలో 10 నిమిషాలకు ఒక పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నాడు.. ఐపీ బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయింది.. దీంతో.. కోవిడ్ ఆస్ప‌త్రిగా మార్చాల‌ని నిర్ణ‌యించారు.. రెపటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఆపేసి… కేవలం కోవిడ్ ఆస్ప‌త్రిగా మార‌నుంది. కాగా, కోవిడ్ తొలి వేవ్ స‌మ‌యంలోనూ గాంధీని పూర్తిస్థాయి కోవిడ్ ఆస్ప‌త్రిగా మార్చారు.. అయితే, క్ర‌మంగా కేసులు త‌గ్గ‌డంతో.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అన్ని సేవ‌లు అందించారు.

Related posts