telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జాతి ర‌త్నాల పై బన్నీ రివ్యూ…

ఈ శివరాత్రి కానుకగా విడుదలైన మూడు తెలుగు సినిమాలలో విజయం సాధించిన సినిమా జాతి ర‌త్నాలు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడిన నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా చేసాడు. ఈ చిత్రానికి అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వహించగా వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్, స్వ‌ప్నా ద‌త్, ప్రియాంక ద‌త్ ఈ మూవీని నిర్మించారు. ఇక తాజాగా ఈ సినిమా చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. త‌న సోష‌ల్ మీడియాలో సినిమా గురించి పోస్ట్‌లు వేశారు. అందులో.. నిన్న రాత్రి జాతి ర‌త్నాలు చూశాను. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. ఒక సినిమాను చూస్తూ ఈ మధ్య కాలంలో ఇంత‌లా న‌వ్వ‌లేదు. న‌వీస్ పొలిశెట్టి నువ్వు నీ న‌టన‌తో అద‌ర‌గొట్టేశావు. రాహుల్ నువ్వు చాలా బ్రిలియంట్‌గా చేశావు. ప్రియ‌ద‌ర్శి, ఫ‌రియా అబ్దుల్లా అభినందించద‌గ్గ వాళ్లు. ర‌ధ‌న్ మ్యూజిక్, సాంకేతిక నిపుణుల ప‌నితీరు బావుంది. ఈ క‌థ‌ను న‌మ్మించినందుకు అశ్వ‌నీద‌త్‌, స్వ‌ప్నా సినిమాను, ప్రియాంక ద‌త్, ద‌త్ గారికి నా రెస్పెక్ట్ అని పోస్ట్ చేసాడు. ఇక దీని పై నవీన్ పోలిశెట్టి స్పందిస్తూ.. అల్లు అర్జున్ కి ధన్యవాదాలు తెలిపాడు.

Related posts