telugu navyamedia
రాజకీయ వార్తలు

కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు.. నలుగురికి గాయాలు

18 soldier died in jammu kashmir bomb blast

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ జిల్లా దంగెర్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ బాలికతోపాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన నలుగురిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

నిఘా వర్గాలు తెలిపిన వివరాల మేరకు కశ్మీర్ లోయలో ప్రశాంతతను చెడగొట్టేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపిస్తున్నట్లుగా సమాచారం. బారాముల్లా జిల్లాలోని బొనియర్ సెక్టార్‌లో గత నెలలో భద్రతా సిబ్బంది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే-ఇ-తోయిబాతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. గుంపులుగా ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి పంపించి ఇక్కడి శాంతిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది.

Related posts