ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలరె స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్వల్ప చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. ఆ సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. స్పీకర్ పై టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్షల్స్ ను పిలిచి టీడీపీ సభ్యులను సీట్లలో కూర్చొబెట్టాలని కోరారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.
టీడీపీ సభ్యులను స్పెండ్ చేయాల్సిందిగా స్పీకర్ తమ్మినేనిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరాడు. ఈ క్రమంలోనే సభ ఆమోదంతో 16 మంది టీడీపీ సభ్యులను ఈరోజు సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు.
టీడీపీ సభ్యులు అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి, సీవీ జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి తదితరులను సభ నుంచి సప్పెండ్ చేస్తున్నట్లు సభాపతి తెలిపారు.
అమరావతిని దెబ్బతీయడంతో.. హైదరాబాద్ కు వలసబాట: చంద్రబాబు