telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబు తీరు పై ఆగరహం వ్యక్తం చేసిన రామకృష్ణారెడ్డి…

sajjala

చంద్రబాబులో మీడియా సమావేశంలో ఆవేశం పాళ్ళు ఎక్కువగా కనిపించాయి. రాముని తల నరకటం అనే మాట పదే పదే చంద్రబాబు ప్రస్తావించటం అతని శాడిజం స్వభావాన్ని బయట పెట్టింది. రాముడి విగ్రహాన్ని ఇలా కసిగా చంద్రబాబు మాట్లడటం హిందువుల మనో భావాలను దెబ్బతీయటమే అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కళా వెంకట్రావు విషయంలో ఏం జరిగిందో తెలిసే చంద్రబాబు ప్రభుత్వం పై రాళ్లు వేస్తున్నారా? 41 సీఆర్పీసీ నిబంధన ఏంటో చంద్రబాబుకు అవగాహన లేదా? అని ప్రశ్నించారు. విజయ రెడ్డి పై దాడి జరిగింది వాస్తవం. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావ్ పాత్ర పై విచారణ చేయటానికి పోలీసులు పిలిచారు.. అరెస్ట్ చేయలేదు… మరి చంద్రబాబు ఎందుకు ఊగిపోతున్నారు అని అన్నారు. ప్రవీణ్ చక్రవర్తి మీద చంద్రబాబు హయాంలోనే ఓ దళిత మహిళ కేసు పెట్టింది మరి అప్పుడు మీ పోలీసులు ఏం చేశారు? అని అడిగిన ఆయన అద్దం ముందు నిలబడి చంద్రబాబు తనను తాను తిట్టుకుంటూ ఉంటాడనుకుంటా అని తెలిపారు. ప్రత్యేక హోదా అంశం మీద ప్రతిపక్ష నాయకుడి హోదా లో జగన్ వైజాగ్ వెళితే ఏం చేశారు? రన్ వే మీద నుంచే ఎందుకు వెనక్కి పంపించారు? మీకులాగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేందుకు కాదు… కేంద్రం పై ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా శాంతియుత క్యాండిల్ ర్యాలీలో పాల్గొనటానికిజగన్ వెళ్ళాలనుకుంటే ఎందుకు అడ్డుకున్నారు?… చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి నాయకుల విషయంలో ఎలా వ్యవహరించారో ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? చంద్రబాబులో ఓ అపరిచితుడు, మహా నటుడు ఉన్నాడు అని పేర్కొన్నారు. అప్పుడు నా నెంబర్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సర్వాంతర్యామి అన్నట్లు వ్యవహరించారు అని అన్నారు.

Related posts