telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అక్ష‌య‌పాత్ర కిచెన్ ఓపేన్ సీఎం జ‌గ‌న్‌..

*అక్షయపాత్ర ద్వారా 2 గంటల్లో 50వేల మందికి భోజనం..
*అక్ష‌య‌పాత్ర పౌండేష‌న్ ద్వారా భోజనం..
*విద్యార్ధుల‌కు స్వ‌యంగా వ‌డ్డించిన జ‌గ‌న్‌..
*అక్ష‌య‌పాత్ర కిచెన్ ఓపేన్ సీఎం జ‌గ‌న్‌..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు.

జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ భోజనాన్ని అందించనుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా అవుతుంది. అక్షయపాత్ర ద్వారా రెండు గంటల్లో 50 వేల మందికి భోజనం అందించేలా ఆధునిక కిచెన్‌ను ఏర్పాటు చేశారు.

అక్షయపాత్ర కిచెన్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం జగన్ విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. . ఆ తర్వాత ఆయన కూడా భోజనాన్ని రుచి చూశారు.

AP CM YS Jagan Visits Akshaya Patra Foundation Photo Gallery - Sakshi

అలాగే.. తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్‌ సంస్థ రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న శ్రీకృష్ణ ఆలయం, గోశాలకు సీఎం జగన్ శుక్రవారం నాడు భూమిపూజ చేశారు.

ఈ  కార్యక్రమాల్లో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర గుంటూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శిలాఫలకంపై పేరు లేకపోవడంతో  హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాత్రం గైర్హాజర్ అయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత జగన్ తాడేపల్లిని నివాసానికి వెళ్లారు

Related posts