telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు పుట్టిన రోజు : అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

achennayudu tdp

చంద్రబాబుపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ టిడిపి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చంద్రబాబుకు తెలుగు ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అచ్చెన్నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా కష్టాన్ని, శ్రమను నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అని.. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడని పేర్కొన్నారు. ఆయన చేయని పదవులు లేవని.. ఉమ్మడి ఏపీకి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. ఎంతో మంది ప్రధానులను, ప్రెసిడెంట్ లను నిర్ణయించిన వ్యక్తి అని.. మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని తెలిపారు. బాబును సీఎం చేసే వరకు ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో పని చేయాలని కోరారు. ప్రస్తుత సీఎం అబద్ధాల పుట్ట అని.. సున్నా వడ్డీ పథకం కొత్తది కాదు..ఇది పాత పథకం అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో చంద్రబాబు డబ్బును వృధా చేశామని ఆరోపించారని.. పోలవరం ప్రాజెక్టును పూర్తి అయితే…రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. 70 శాతం పోలవరం ప్రాజెక్టును టిడిపి పూర్తి చేసిందని గుర్తు చేశారు. రివర్స్ టెండరింగ్ చేసి 780 కోట్లు ఆదా చేశామని జగన్ చెప్పారని..3320 కోట్లు అంచనాలు పెంచారని ఫైర్ అయ్యారు.

Related posts