telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఖ‌రారైన ఏపీ కొత్త మంత్రుల పేర్లు ఇవే ..

ఏపీ నూతన కేబినెట్‌పై ఉత్కంఠ నెల‌కొంది. ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గంలోకి 10 మంది పాత వారికి .. 15 మంది కొత్త వారికి అవకాశం కల్పిస్తూ సీఎం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 

సామాజిక సమీకరణాల నేపథ్యంలో పదిమందిని కొనసాగించాలని జగన్ నిర్ణయించారని తెలిసింది. అయితే ఎవరిని మంత్రి పీఠం వరిస్తుందోనని ఆశావహులు ఉత్కంఠలో ఉన్నారు. ఏ ఫోన్ వచ్చినా ఎమ్మెల్యేలు ఆతృతగా చూస్తున్నారు.

హైకమాండ్ ఫోన్ కోసం టెన్షన్‌లో ఎమ్మెల్యేలు ఉన్నారు. పాత‌మంత్రుల్లో అదే టెన్ష‌న్ నెల‌కొంది. అశావాహులంతా స‌జ్జ‌ల ఇంటికి క్యూ క‌డుతున్నారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఇప్ప‌టివ‌ర‌కు ఖ‌రారైన‌ మంత్రుల జాబిత విడుద‌ల లిస్టు ఇదే..
1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2. బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌
3. విడుద‌ల ర‌జిని
4. గుడివాడ అమ‌ర్‌నాధ్‌
5. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
6. దాడిశెట్టి రాజా
7. కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి
8. వేణుగోపాల కృష్ణ
9. జోగి ర‌మేష్‌
10.గుమ్మ‌నూరి జ‌య‌రాం.

 

Related posts