ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పని సరిచేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్న సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ భాష పరిరక్షణ అంశాన్ని లేవనెత్తారు.
ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కేశినేని వ్యాఖ్యానించారు. ఏపీ సర్కారు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసిందని కేశినేని నాని అన్నారు. దేశంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ఆయన సభలో అన్నారు.