ఉత్తరాంధ్ర యువతకి రావాల్సిన ఉద్యోగాలను “గో బ్యాక్” అని తరిమేశారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఉత్తరాంధ్ర పర్యటనకు వైసీపీ ఆటంకాలు కలిగిస్తోన్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తుగ్లక్ పాలనలో ఉత్తరాంధ్ర, రాయలసీమకి రావాల్సిన కంపెనీలు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. విశాఖ ప్రమాదకరమైన ప్రాంతం అంటూ జీఎన్ రావ్ కమిటీతో రిపోర్ట్ రాయించి విమర్శించారు.
‘హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా రాని వ్యక్తి ఇప్పుడు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా? వోక్స్ వ్యాగన్ సొమ్ముల్లానే హుద్ హుద్ సమయంలో సహాయం కోసం జగన్ గారు ఇచ్చాను అంటున్న రూ.50 లక్షలు పోనాయి ఏటి సేత్తాం?’ అని నిలదీశారు.’దోపిడీ ప్రణాళిక తప్ప, అభివృద్ధి ప్రణాళిక లేకుండా చెత్త కమిటీలతో ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించారని విమర్శించారు.
ఆ ప్రాంతాన్ని ప్రజలకే కేటాయించేలా చేస్తాం..