telugu navyamedia
క్రీడలు వార్తలు

సునీల్ నరైన్ బౌలింగ్ పై ఫిర్యాదు…

వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్ 2020 లో కోల్‌కత నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్- కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో నరైన్ స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ గఫెనీ, ఉల్హాస్‌ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. దాంతో బీసీసీఐ నరైన్‌ ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నట్లు తెలిపి అతను ప్రస్తుతం బౌలింగ్‌ వేయవచ్చు అని స్పష్టం చేసింది. కానీ మరోసారి ఇలా ఫిర్యాదు వస్తే బీసీసీఐ అనుమతించేవరకు నరైన్‌ బౌలింగ్‌ వేసే అవకాశం ఉండదు అని ఆ ప్రకటనలో తెలిపింది. అయితే గతంలో కూడా పలుమార్లు నరైన్ బౌలింగ్ శైలి పై ఫిర్యాదులు వచ్చాయి. ఈ కారణంగానే అతను 2015 వరల్డ్‌కప్‌ టోర్నీకి కూడా దూరమయ్యాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ 2016లో ఐసీసీ అతని బౌలింగ్‌కు క్లియరెన్స్‌ ఇవ్వడంతో అతను మళ్ళీ క్రికెట్ లోకి వచ్చాడు. కానీ 2018లో పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ లో మరోసారి అతని బౌలింగ్‌పై ఫిర్యాదు వచ్చింది. టీ20 లీగ్‌లోనూ నరైన్‌కు బీసీసీఐ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో కోల్‌కతా యాజమాన్యం అతడ్ని జట్టులోకి తీసుకుంది. బీసీసీఐ సూచనల మేరకు నరైన్‌ తన బౌలింగ్‌ శైలి మార్చుకొని బౌలింగ్‌ వేస్తున్నాడు. ఆ కారణంగా అతను ఇంతకముందులా బౌలింగ్‌లో ప్రభావం చూపించలేకపోతున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే.

Related posts