మేషం : పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆటుపోట్లు. ఆస్తుల వివాదాలు.
వృషభం : ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.విందువినోదాలు.
మిథునం : వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మీ కష్టం ఫలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు.
కర్కాటకం : ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం : నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో ముఖ్య విషయాలు ^è ర్చిస్తారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.
కన్య : కొత్తగా అప్పులు చేస్తారు. మానసిక అశాంతి. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలతో భారంగా మారతాయి. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ధననష్టం.
తుల : ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం.
వృశ్చికం : నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.
ధనుస్సు : కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.గృహయోగం.
మకరం : రాబడికి మించి ఖర్చులు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో చికాకులు. మానసికఆందోళన. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్యసమస్యలు.
కుంభం : అంచనాలు తప్పుతాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు ముందుకు సాగవు.
మీనం : ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి.