telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు

ముంబై హైకోర్టులో చందాకొచ్చర్ పిటిషన్

chandakochar attended before ED

బ్యాంకు విధుల నుంచి తప్పిస్తూ ఆర్బీఐ చేసిన నిర్ణయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్ సవాలు చేశారు. ఈ మేరకు ముంబై హైకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఇప్పటికే కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యంపై కేసు వేసిన విషయం తెలిసిందే. గత మార్చి 13న కొచ్చర్ తొలగింపు నిర్ణయాన్ని ఆర్బీఐ ఆమోదించింది.

ఆర్బీఐ అనుమతికి ముందే జనవరి 31న ఐసీఐసీఐ యాజమాన్యం ఆమెను విధులనుంచి తొలగించింది. అనంతరం దీనికి సంబంధించి అనుమతులు కోరుతూ బ్యాంక్ ఫిబ్రవరి 5న ఆర్బీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మార్చి 13న కొచ్చర్ తొలగింపును సమర్థిస్తూ.. ఆమోదముద్ర వేసింది. ఆర్బీఐ అనుమతి రాకముందే తనను విధుల నుంచి ఎలా తొలగిస్తారంటూ కొచ్చర్ తన పిటిషన్లో ప్రశ్నించారు. కొచ్చర్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆర్బీఐకి నోటీసులు జారీచేసింది.

Related posts