telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

టీవీ9 రవిప్రకాష్‌ ఇంట్లో సోదాలు!

Ravi Prakash

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌ సంస్థకు హాని కల్గించే ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులతో కుమ్మకై ఫోర్జరీ పత్రాలను సృష్టించారని అలంద మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో వైపు మెజారిటీ వాటాదారుల హక్కుల అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు రవిప్రకాష్‌ పాల్పడ్డారని అలంద సంస్థ ఆరోపిస్తోంది. సంస్థ ప్రయోజనాలకు సంబంధించి రవిప్రకాష్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడ పెట్టింది.

కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని కూడ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ కార్యదర్శి కౌశికర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గురువారం నాడు రవిప్రకాష్ ఇంట్లోనూ, కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. ఈ రోజు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో టీవీ 9 యాజమాన్య కేసు విచారణ జరగనుంది. విచారణ నేపథ్యంలోనే రవిప్రకాష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

Related posts