అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ సభ్యులు భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం భారత్ వచ్చిన ట్రంప్ కుటుంబీకులు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా, ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని ఓ పాఠశాలకు విచ్చేశారు.
మోతీబాగ్ లోని ఆ ప్రభుత్వ పాఠశాలలో చిన్నారుల కోసం నిర్వహించే హ్యాపీనెస్ క్లాస్ కు హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. చిన్నారులు విచిత్ర వేషధారణలో రావడం గమనించిన మెలానియా వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. అంతేకాదు, హ్యాపీనెస్ క్లాస్ పాఠాలు బోధించారు.