telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రపంచ కప్ :.. ముక్కి మూలిగి గెలిచిన పాక్.. అయినా నిరాశే..

pak won on newzeland but not to semis

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా పాక్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన పోరులో మొత్తానికి పాక్ ముక్కిమూలిగి గెలిచింది. బంగ్లాదేశ్ తో లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో పాక్ 94 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పాక్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిది నిప్పులు చెరిగే బంతులకు బంగ్లాదేశ్ వద్ద సమాధానం లేకపోయింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలో దిగన బంగ్లా జట్టు చివరికి 44.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. షహీన్ అఫ్రిది తన సంచలనాత్మక బౌలింగ్ స్పెల్ లో 9.1 ఓవర్లలో 35 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ లో ఆరు వికెట్లు తీయడం చాలా అరుదైన విషయం. షాదాబ్ ఖాన్ 2, అమీర్, రియాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

బంగ్లాదేశ్ జట్టులో ఆల్ రౌండర్ షకీబల్ హసన్ తన ఫామ్ ను కొనసాగిస్తూ అర్ధసెంచరీతో మెరిశాడు. షకిబ్ 77 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్ మన్లలో ఆ స్థాయి ఇన్నింగ్స్ మరొకటి లేకపోవడంతో బంగ్లా భారీతేడాతో ఓటమిపాలైంది. లిటన్ దాస్ 32, మహ్మదుల్లా 29 పరుగులు చేశారు. టాస్ గెలిచిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసింది. పాక్ ఈ మ్యాచ్ గెలవకముందే సెమీస్ అవకాశాలను కోల్పోయింది. బంగ్లాపై 316 పరుగుల తేడాతో గెలిస్తే సెమీస్ బెర్తు దక్కే అవకాశాలున్నా, పాక్ ఆ అద్భుతాన్ని చేయడంలో విఫలమైంది.

Related posts