ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై పట్నా పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రశాంత్ కిషోర్ తన కంటెంట్‌ను దొంగిలించి ‘బీహార్ కి బాత్’ ప్రచారానికి వాడుకున్నారని శశ్వత్ గౌతమ్ పట్నా నగరంలోని పాటలీపుత్ర పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. తన ఐడియాను కాపీ కొట్టి పీకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారంటూ ఆయనపై శశ్వత్ గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రశాంత్ కిషోర్ పై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేశారు.
కంటెంట్ ను ఒసామా అనే వ్యక్తి పేరిట ప్రశాంత్ కిషోర్ వాడుకున్నారనే ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ‘బాత్ బిహార్ కి’ అంటూ రాజకీయ ప్రచారం సాగించారు. ప్రశాంత్ కిషోర్ బీహార్ తోపాటు పలు రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. దేశంలో ఉత్తమ రాష్ట్రాల్లో బీహార్‌ను ఒకటిగా చేసేందుకే తాను ‘బాత్ బీహార్ కీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని పీకే తెలిపిన సంగతి తెలిసిందే.
షరీఫ్ నిర్ణయం వెనుక చంద్రబాబు: కొడాలి నాని