telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీసీల అభివృద్దే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం…

gangula kamalakar trs

నిజామాబాద్‌లో జరుగుతున్న బీసీ కుల సంఘాల సమావేశంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీలకు కావాల్సినవి తెలుసుకొని.. వాటినే చట్టాలుగా చేయండని సీఎం కేసీఆర్ చెప్పారని వెల్లడించారు.. వెనుకబడిన ‌కులాలను అభివృద్ధిలోకి తీసుకురావాలనేదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పిన ఆయన.. గత 70 ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, బీసీలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన ఆయన.. గత ప్రభుత్వాలు బీసీలకు విద్యను అందించడంపై దృష్టి పెట్టలేదన్నారు. 2015 సంవత్సరంలో 261 గురుకులాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించారని.. ప్రస్తుతం లక్షలాది మంది బీసీలు గురుకులాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు.  ఇక, సంచార జాతులు, ఎంబీసీలకు గుర్తింపునిచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంమే అన్నారు గంగుల కమలాకర్.. బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం, సీఎం కేసీఆర్ గారు హైదరాబాద్‌లో 82 ఎకరాలను కేటాయించారని గుర్తుచేశారు. బీసీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు, కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఆర్థిక చేయూతనిస్తున్నామన్నారు. బీసీ హాస్టళ్లలో గత ప్రభుత్వాలు నాసిరకం బియ్యంతో భోజనాలు పెట్టేవి‌.. కానీ, సీఎం కేసీఆర్ ప్రతి బీసీ హాస్టల్‌కు సన్నబియ్యం అందిస్తున్నారని ప్రశంసించారు.

Related posts