telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పాక్ ఆర్థిక వ్యవస్థ .. ఘోరంగా ఉంది.. : ఐఎంఎఫ్

IMF report and suggestion to pak

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), పాక్ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకున్నదని, దీనిని సరిదిద్దేందుకు భారీ సంస్కరణలు అవసరమని ఆ దేశ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక చిక్కుల్లో వున్న పాక్‌ ప్రభుత్వానికి 600 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధమైన ఐఎంఎఫ్‌ తాజాగా ఈ వ్యాఖ్యలుచేయటం గమనార్హం. ప్రస్తుతం 800 కోట్ల డాలర్ల లోపే నగదు నిల్వలు ఉన్నాయి.

పాక్ ప్రధానిగా గత ఏడాది ఆగస్టులో ఇమ్రాన్‌ సర్కారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత బెయిలవుట్‌ ప్యాకేజి కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వినతిని ఆమోదించిన ఐఎంఎఫ్‌ గత వారంలో 600 కోట్ల డాలర్ల సాయాన్ని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌ తాత్కాలిక ఛైర్మన్‌, డేవిడ్‌ లిప్టన్‌ మీడియాతో మాట్లాడుతూ బలహీనమైన, అసమతుల్యతతో కూడిన వృద్ధి, ఆర్థిక, ద్రవ్య అవసరాల వంటి సంక్లిష్టమైన ఆర్థిక సవాళ్లను పాక్ ఎదుర్కొంటోందన్నారు.

Related posts