telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

టాస్మానియా : .. వైరస్ తో వెల్లుల్లి.. దిగుమతి చేసుకున్న మహిళకు 11 ఏళ్ళ జైలు..

importing virus garlic caused 11 years jail to women

ఓ రైతు వైరస్ ఉన్న వెల్లుల్లి దిగుమతి చేసుకున్నందుకు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఆస్ట్రేలియాలోని టస్మానియాకు చెందిన లెటేటియా అన్నే వేర్ అనే మహిళా రైతు అమెరికా కెనడాల నుంచి 2,200 వెల్లుల్లి గడ్డలను దిగుమతి చేసుకుంది. ఈ రకం వెల్లుల్లిలో క్సైలెల్లా ఫాస్టిడియోసా అనే బ్యాక్టీరియా ఉందట. పంటపొలాల్లో ఇది కలిసిందంటే మొత్తం పంటలే దెబ్బతింటాయట. వేర్ గత 18 నెలల్లో 21 రకాల వెల్లుల్లి గడ్డలను దిగుమతి చేసుకుంది. అందులో పంటలకు హాని కలిగించే ఓ రకం వెల్లుల్లికి మాత్రం “తోటలోకి మాత్రమే” అనే లేబుల్ అంటించమని దిగుమతి దారులకు చెప్పింది.

ఆస్ట్రేలియన్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీ, మొక్కలకు కానీ పంటలకు కానీ ప్రమాదకరంగా మారే ఏ చర్యనైనా బోర్డు అంగీకరించబోదని వెల్లడించింది. ఇదిలా ఉంటే వేర్‌కు 18 నెలలు జైలు శిక్ష విధించారు జడ్జీ. అయితే కేవలం రెండు నెలలకే బయటకు వచ్చే అవకాశం ఉందని అయితే ఆమె 2వేల ఆస్ట్రేలియన్ డాలర్లు జరిమానాగా కట్టి రానున్న మూడేళ్లలో సత్ప్రవర్తనతో ఉంటానన్న షరతులపై సంతకం పెట్టాలని సూచించింది. అయితే వేర్‌ చేసిన పని క్షమించరానిదని శిక్ష సరైందేనని ఫెడరల్ వ్యవసాయశాఖ మంత్రి బ్రిడ్జెట్ మెకెంజీ తెలిపారు. క్లీన్, గ్రీన్, సేఫ్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా టాస్మానియాకు మంచి పేరుంది. క్సైలెల్లా ఫాస్టిడియోసా అనే బ్యాక్టీరియా అమెరికాలో కనుగొన్నారు. మొక్కలు ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోగల శక్తి ఈ బ్యాక్టీరియాకు ఉంది. ఈ బ్యాక్టీరియాతో ఇటలీలో లక్షల సంఖ్యలో ఆలివ్ మొక్కలు పెరగకుండా ధ్వంసం చేసింది.

Related posts