telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే విషెష్…!

తెలుగు చిత్రసీమలో క్రేజీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ అనతికాలంలోనే సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు. మే 9వ తేదీ 1989 సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించిన ఆయన నేడు తన 31వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఎన్నో నాటకాల్లో నటించిన తరువాత సినిమాల్లో ప్రయత్నించారు. మొదట రవిబాబు ‘నువ్విలా’ సినిమాలో అవకాశం పట్టేశారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్నపాత్రలో నటించారు. ఆ వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నానితో కలసి నటించారు. ఈ సినిమాల తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తరుణ్ భాస్కర్ రూపొందించిన ‘పెళ్లి చూపులు’ మూవీ ఆయన కెరీర్‌కి పునాదులు వేయగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ నట జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ సినిమాతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఆయన కెరీర్‌లో మరో చెప్పుకోదగిన సినిమా ‘గీతగోవిందం’. పరశురామ్ రూపొందించిన ఈ సినిమాలో విజయ్ పర్‌ఫార్‌మెన్స్ చూసి అమ్మాయిలంతా ఆయనకు ఫిదా అయ్యారు. దీంతో విజయ్ సినిమా వస్తుందంటే చాలు యూత్ అంతా ఆతృతగా ఎదురుచూస్తారు. ఆ తర్వాత ”నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్” లాంటి సినిమాలతో అలరించారు విజయ్. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నారు. అభిమానులు తమ రౌడీ హీరోకు సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్తున్నారు.

Related posts