telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అలా ఉద్యోగ విరమణ చేశాడు.. ఇలా హెలికాప్టర్ లో ఊరిలో దిగాడు.. మాజీ అటెండర్ రేంజ్ కల..

attender dream to fly comes true

అందరూ వారివారి కలలు నెరవేర్చుకోడానికే రోజూ కొరుకులపరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇలా పరిగెత్తే వారందరు వారి కలను నెరవేర్చుకుంటున్నారో లేదో తెలియదు కానీ, తాజాగా ఉద్యోగ విరమణ చేసిన ఒక అటెండర్ మాత్రం తన ఖరీదైన కలను అలా ఉద్యోగ విరమణ చేశాడో లేదో, ఇలా తన కలను తీర్చేసుకున్నాడు. సాధారణంగా చాలామంది రిటైర్మెంటు ఫంక్షన్ అనంతరం కోలాహలంగా ఊరేగింపుతో ఇంటికి చేరుకోవాలని భావిస్తుంటారు. హర్యానాలోని ఓ పాఠశాల అటెండర్ ఏకంగా హెలికాప్టర్ లో ఇంటికి వెళ్లాడు. అందుకోసం లక్షల ఖర్చయినా వెనుకాడలేదు.

ఆ అటెండర్ పేరు కూరే రామ్, ఫరీదాబాద్ జిల్లాలోని నీమ్కా ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి ఉద్యోగి. అక్కడే 40 ఏళ్ల పాటు పనిచేశాడు. తాజాగా, పదవీవిరమణ చేశాడు. పాఠశాల నుంచి కూరే రామ్ నివాసం ఉండే ప్రాంతం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అందరిలా కాకుండా ఓ హెలికాప్టర్ లో తన నివాసానికి వెళ్లాలన్నది కూరే రామ్ కల అని అతడి సోదరుడు, గ్రామ సర్పంచ్ అయిన శివకుమార్ తెలిపాడు. హెలికాప్టర్ అద్దె రూ.3.5 లక్షలు అయినా కూరే రామ్ వెనుకంజ వేయలేదు. తాను పొదుపుచేసిన డబ్బుతో హెలికాప్టర్ అద్దెకు తీసుకుని సగర్వంగా తన ఇంటికి చేరుకున్నాడు. హెలికాప్టర్ లో దిగిన కూరే రామ్ కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.

Related posts