telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాప్తి పై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

Delhi

మన దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా టెస్టులు పెంచడంతో పాటుగా అవసరమైతే కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్స్ ను పెంచుతామని తెలిపారు.  ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే యాప్ లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, కొంతమందికి వ్యాక్సిన్ కోసం యాప్ లో పేరును నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే వ్యాక్సిన్ కోసం పేరు నమోదు చేసుకోకుండా డైరెక్ట్ గా వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు ఢిల్లీ హెల్త్ మినిష్టర్ స‌త్యేంద్ర జైన్ పేర్కొన్నారు.  సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం కల్పించబోతున్నట్టు అయన పేర్కొన్నారు.  రోజుకు 80 నుంచి 90 వేల వరకు టెస్టులు చేస్తున్నట్టు స‌త్యేంద్ర జైన్ తెలిపారు. అయితే చూడాలి మరి ఇదే దారిలో మిగితా రాష్ట్రాలు కూడా పయనిస్తాయా… లేదా అనేది.

Related posts