telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఫ్లాష్‌ : హైదరాబాద్‌ లో మరో అగ్ని ప్రమాదం

fire in plastic factory dhaka 13 died

మహానగరం హైదరాబాద్‌ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని గన్‌ ఫౌండ్రీలో ఇవాళ సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొదట ఓ హోటల్‌ కిచెన్‌లో చెలరేగిన మంటలు..పక్కనే ఉన్న ఓ చెప్పుల గొడౌన్‌కు వ్యాపించాయి. గోడెన్‌లోని చెప్పులు, హోటల్‌లోని ఫర్నీచర్‌ అగ్నికి దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందా.. లేదా ఎలా జరిగిందన్న దానిపై విచారణ ప్రారంభించారు పోలీసులు. ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీపావళి పర్వదినాన ఈ అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టంకరమని అక్కడ ఉన్నవారు అంటున్నారు. కాగా.. గతనెలలో కూడా అబిడ్స్ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే..

Related posts