telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలియాపై ట్రోలింగ్… రాజ్యాంగ ప్రవేశికను తప్పుగా పోస్ట్ చేసి…!

Alia

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను నెటిజెన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ తారలు సోనాక్షి సిన్హా, ఇషాన్ కట్టర్ సైతం రాజ్యాంగ ప్రవేశికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అలియా చేసిన పోస్టులో కొన్ని ముఖ్యమైన పదాలు లేకపోవడంతో నెటిజెన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనలపై దేశంలోని ప్రముఖులు స్పందిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అలియా భట్.. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాజ్యాంగ ప్రవేశికను షేర్ చేసింది. అయితే అందులో సెక్యూలర్, సోషలిస్ట్ అనే పదాలు లేవు. దీంతో అలియాభట్‌పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘అలియా భట్‌కు నిజమైన రాజ్యాంగ ప్రవేశిక ఏంటో తెలియదు. గూగుల్ సెర్చ్ చేసేప్పుడు ముందు ఏది కనిపిస్తే అది పోస్ట్ చేస్తుంది. ఆమె షేర్ చేసిన ప్రవేశికలో సెక్యూలర్, సోషలిస్ట్ అనే పదాలు లేవు. పేరుకు సెలబ్రిటీలు, వారి ఆదర్శాలు ఇలా ఉంటాయి’’ అని నెటిజెన్ ట్వీట్ చేశారు. ఇంకొందరు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అంటూ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

Related posts