telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్

Allu-Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం ఉదయం కుటంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. బన్నీ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించడం విశేషం. బన్నీని చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఆయన వెంట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అల… వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై, రికార్డ్ స్థాయి వసూళ్లతో తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పి, ఇండస్ట్రీ హిట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లోనూ అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఈ సందర్భంగా బన్నీ, త్రివిక్రమ్ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌‌తో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో బన్నీ షూట్‌లో జాయిన్ కానున్నాడు.

Related posts