ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేది లేదని 27వ రోజు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో ఉంది. ఈ సమస్యపై తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆర్టీసీ విషయంలో వివిధ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుంది ప్రభుత్వం. ఆర్టీసీలో కీలక మార్పులు చేస్తామని ఇప్పటికే కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ లో 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేటు బస్సులు ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. నూతన సంస్కరణలు తీసుకు వచ్చేందుకు భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం, ఆర్టిసి మూడు ముక్కలు చేయాలని ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
దీనిలో జిహెచ్ఎంసి పరిధిని ఒక భాగంగా… మిగిలిన ఇతర కార్పోరేషన్లు మరియు కొన్ని జిల్లా కేంద్రాలకు కలిపి మరో భాగంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మిగిలిన గ్రామీణ ప్రాంతాలనానికి కలిపి గ్రామీణ రవాణా సంస్థగా మరో భాగంగా విడదీసేందుకు ప్రతిపాదన తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఈ మూడు భాగాల మధ్య పోటీ ఏర్పడి ఆర్టీసీకి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉందని తెరాస ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. నవంబర్ 2న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం.