telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎన్నికల వేళ.. అస్సాం, బెంగాల్‌ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో భూకంపం

దేశంలో ఇవాళ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతల ఎన్నికలు ముగిసాయి. అస్సాంలో చివరిదశ ఎన్నికలు జరుగుతుండగా.. బెంగాల్లో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిక్కిం-నేపాల్‌ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ కు తూర్పు ఆగ్నేయంగా 25 కిలోమీటర్ల దూరంగా సంభవించిన భూకంపం తీవ్రత 5.4 తీవ్రతతో ఉందని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ సీస్మోలజీ పేర్కొంది. సిక్కింతో పాటు అస్సాం, బెంగాల్‌, బీహార్‌లలో కూడా స్వల్పంగా భూకంపం వచ్చింది. సోమవారం రాత్రి 8 గంటల 49 నిమిషాలకు భూమి కనిపించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.4 గా నమోదైంది. దీంతో భయంతో ఇళ్లను వదిలి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఎన్నికల జరిగే నేపథ్యంలో భూకంపం రావడంతో ప్రధాని మోడీ ఆరా తీశారు. సిక్కిం, బిహార్, అస్సాం ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మాట్లాడి భూకంప ప్రభావం గురించి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు.

Related posts