telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కాలాన్ని ఆపలేక….. నీఒడిలో ఒదగలేక

మీ దూరం భారమైంది
మీ రూపం కరువైంది
మీ మౌనం బరువైంది
మీ సాంగత్యం విలువైంది
మీ సహచర్యం దూరమైంది
మీ ప్రేమ నను చేరనంది
మీరాక మారింది
మీలో నేను లేనంది
నాతో ఉండలేకుంది
అది నాకు అర్థం కాకుంది
నా తలరాతని సర్థి చెప్పుకుంది
మనసు
హృదయం తల్లడిల్లింది
సమయం కాదంది
సంధర్భం రానీమంది
నీ రాకకై ఎదురు చూస్తుంది
నీవు లేక గుండే పగిలింది
మీ చిత్ర పటాన్ని చూసి సేద తీరింది
కనుల నిండా కన్నీరొలికింది
సుతిమెత్తని భాదతో రోధించింది…
………………………………………………
నీవులేక నిదురరాక
కనురెప్ప మూయక
కంటిపాప ఎదురుచూస్తుందని
నీవు గ్రహించక
కాలాన్ని ఆపలేక
నీఒడిలో ఒదగలేక
మనసుని మరిపించలేక
మదినిండిన మీజ్ణాపకాలతో
ఇమడలేక ఎలా తెలవారుతుందో
ఈ రేయి ఇక

Related posts