telugu navyamedia
రాజకీయ వార్తలు

నిబంధనలను కఠినతరం చేస్తాం: ఉద్ధవ్ థాకరే

కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఉద్ధవ్ థాకరే తెలిపారు. ఇందులో భాగంగా నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు. వలస కూలీలు స్వగ్రామానికి వెళ్లిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు స్థానికులు బయటకు రావాలని ఉద్ధవ్ కోరారు. గ్రీన్‌జోన్‌లో ఉన్నవారు దయచేసి బయటకు రావాలని, పరిశ్రమల్లో మానవ వనరుల అవసరం ఎంతో ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రధాని మోదీ భాషలో అభ్యర్థిస్తున్నానని, ఆత్మనిర్భర్ భారత్ కావాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, లాక్‌డౌన్ నాలుగో విడతలోనూ పాత నిబంధనలే అమల్లో ఉంటాయని తెలిపారు. అనుమతి లేకుండా తిరిగే వాహనాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుయతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం సాధ్యం థాకరే స్పష్టం చేశారు.

Related posts