నసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేసే విషయంలో అన్నయ్య చిరంజీవినే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారన్న విషయంపై జనసేన కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తిరేపుతోంది. 2009 ఎన్నికల్లో అన్న చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. అయితే పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో మాత్రమే గెలిచారు.
ఇప్పుడు తాను కూడా అన్నయ్య దారిలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారు.పార్టీ కార్యవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని పవన్ ట్వీట్ చేశారు. తాజా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన పవన్ తన స్థానాన్ని మాత్రం ఖరారు చేయలేదు. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం కల్లా పవన్ పోటీ చేసే రెండు స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.