పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా హరి హర వీర మల్లు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్ర కథ 17వ శతాబ్దంలోని మొఘల్ పరిపాలన సమయానికి చెందినగా తెలుస్తోంది. అప్పటి అన్యాయాలను ఎదురించే తిరుగుబాటు దారుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదల చేసిన సినిమా టీజర్, పోస్టర్లు నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా హరి హర వీర మల్లు కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో పవన్ పదునైన చూపులతో.. రెండు చేతుల్లో పవన్ కళ్యాణ్ బళ్లాలను పట్టుకొని మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. గ్రీన్ షర్ట్ ధరించి, ఆపై శాలువా చుట్టుకొని ఉన్న సరికొత్త లుక్ ను సొంతం చేసుకున్నాడు. బ్యాక్ డ్రాప్ పరిశీలిస్తే ఒక గ్రామ కూడలి వద్ద జరిగే యాక్షన్ సీక్వెన్స్ గా తెలుస్తోంది.
దీంతో పవన్ కొత్త పోస్టర్ కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
శ్రీరామ నవమి సందర్భంగా “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం.
షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు లొకేషన్ లో పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏయం రత్నం సీతారాములకు భక్తి శ్రద్ధలతో పూజ చేశారు.. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సుశాంత్ ఆత్మహత్య… దుమారం రేపుతున్న మాజీ ముఖ్యమంత్రి భార్య కామెంట్స్