telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ నుండి .. మరోపాట..

another single from ismart sankar movie

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా ‘ఇస్మార్ట్ శంకర్’ రూపొందింది. నిధి అగర్వాల్ – నభా నటేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సింగిల్ ను వదిలారు. “ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా .. ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా” అంటూ ఈ పాట సాగుతోంది.

యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా మణిశర్మ కట్టిన బాణీ చాలా బాగుంది. భాస్కరభట్ల సాహిత్యం, ప్రేమికుల భావజాలాన్ని ఆవిష్కరించడానికి అందమైన పదజాలాన్ని అర్థవంతంగా ఉపయోగించాడు. అనురాగ్ కులకర్ణి – రమ్య బెహరా ఈ పాటకి ప్రాణం పోశారు. మొత్తంగా చెప్పాలంటే ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిలా నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related posts