రేపు (సెప్టంబర్ 10) వినాయక చవితి. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గతేడాది కరోనా కారణంగా ఈ ఉత్సవాలను జరుపుకోలేక పోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా నటి, వైసీపీ ఎమేల్యే రోజా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి రోజు మట్టి విగ్రహాలను ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుందాము, పర్యావరణాన్ని కాపాడుకుందాం అన్నారు. కరోనా థర్డ్ వేవ్ నుండి మనల్ని మన పిల్లల్ని కాపాడుకుందాం అని తెలిపారు.
పవన్ పేరుకు తగ్గట్టే గాలి మాటలు: అంబటి