telugu navyamedia
రాజకీయ

బీహార్‌లో కొలువు తీరిన కొత్త‌గా స‌ర్కార్‌..బీహార్‌ సీఎంగా నితీశ్ ..డిప్యూటీగా సీఎంగా తేజస్విప్రమాణం..

*బీహార్ సీఎంగా నితీష్ ప్ర‌మాణ స్వీకారం
*8వ బీహార్ సీఎంగా నితీష్‌..
*డిప్యూటీ సీఎంగా తేజ‌స్వీ యాద‌వ్‌
*8 పార్టీల కూట‌మికి నితీష్ నేతృత్వం

బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాజ్ భవన్ లో గవర్నర్ ఫాగు చౌహాన్ నితీష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్ కుమార్  బీహార్‌కు సీఎంగా ఎనిమిదో సారి బాధ్యతలు చేపట్టారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్‌ బై చెబుతూ.. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు మంగళరం సాయంత్రం సమర్పించారు. అయితే.. ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ ప్రమాణ కార్యక్రమానికి బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌ భార్య రాజశ్రీ తదితర ప్రముఖులు, ముఖ్యనేతలు హాజరయ్యారు.

 

Related posts