telugu navyamedia
రాజకీయ వార్తలు

ఏ అన్యాయానికీ తలవంచను: రాహుల్

Rahul gandhi congress

యూపీలోని హత్రాస్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో నిన్న బాధిత కుటుంబాన్ని కలవడానికి వెళుతుండగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డగించిన సంగతి తెలిసిందే. లాల్చీ పట్టుకుని యూపీ పోలీసులు లాగేయడంతో రాహుల్ కిందపడ్డారు. ఆయన భుజానికి స్వల్పగాయమైంది.

ఈ నేపథ్యంలో రాహుల్ ఘాటుగా స్పందించారు. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ఏ విధమైన అన్యాయానికీ తాను తలవంచనని రాహుల్ చెప్పారు. అసత్యాలను సత్యానికి ఉన్న శక్తితో జయిస్తానని పేర్కొన్నారు. అసత్యంతో పోరాడే సమయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తాను ఎదుర్కొంటానని తెలిపారు. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడనని రాహుల్ వ్యాఖ్యానించారు.

Related posts