telugu navyamedia
రాజకీయ

ఢిల్లీలో ఆఫ‌రేష‌న్ లోట‌స్ ఫెయిల్‌ :విశ్వాస ప‌రీక్ష‌ల్లో నెగ్గిన కేజ్రీవాల్ స‌ర్కార్‌

*ఢిల్లీ విశ్వాస ప‌రీక్ష‌ల్లో నెగ్గిన కేజ్రీవాల్ స‌ర్కార్‌
*కేజ్రీవాల్ కుమ‌ద్ద‌తుగా 59 మంది ఎమ్మెల్యేలు ఓట్లు
*40 మంది ఎమ్మెల్యేల‌కు కొనేందుకు ప్ర‌య‌త్నించార‌న్న కేజ్రీవాల్‌..

ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం నెగ్గింది. విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్‌కు మద్దతుగా 58 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. ఇందులో 62 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన అనంత‌రం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్ష బీజేపీ పన్నిన ఆపరేషన్‌ కమలం విఫలమైందన్నారు. 40 మంది ఎమ్మెల్యేల‌కు కొనేందుకు బీజేపీ ప్ర‌య‌త్నించారని అన్నారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. త‌మకు అసెబ్లీలో 62 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉండ‌గా, ఇద్ద‌రు విదేశాల్లో ఉన్నార‌ని, ఓ స‌భ్యుడు జైల్లో ఉన్నాడని అన్నారు. మ‌రో సభ్యుడు శాస‌న‌స‌భ స్పీక‌ర్ అని తెలిపారు.

నా పిల్లలిద్దరు ఐఐటీలో చదువుతున్నారు.  భారత్‌లోని ప్రతి పిల్లాడికి అలాంటి విద్య అందించాలనుకుంటున్నాను.

ఎమ్మెల్యేలను 20-20, 50-50 కోట్లకు కొంటున్నారని.. ఈ బీజేపీ వాళ్లు రూ.6300 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని.. దాని వల్లే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని బీజేపీపై ఆరోపణలు చేశారు.

కాగా ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గత కొంత కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆప్‌ను వీడి బీజేపీలో చేరితో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఆఫర్‌ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి.. సొంత ప్రభుత్వంపైనే సీఎం కేజ్రీవాల్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

Related posts