telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సుజనా చౌదరి కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి రెండేళ్ల క్రితం ఓ కంపెనీ వ్యవహారంలో ఆంధ్రా బ్యాంక్‌ని మోసం చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు నుంచి కంపెనీ రుణాలు తీసుకుంది. రూ.360 కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు రెండేండ్ల క్రితం కేసు నమోదు చేశారు.

కంపెనీ ఎండీతో పాటు డ్రైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన ఈ బృందం హైదరాబాద్‌లోని సుజనా చౌదరి ఇల్లు, కార్యాలయాల్లో, శ్రీనగర్ కాలనీలోని సుజనా చౌదరి నివాసంలో, జూబ్లిహిల్స్, పంజాగుట్టలోని కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో కొన్ని డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేసినట్లు సమాచారం.

Related posts