భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం(జూలై 17) జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-9,11-21,21-15 తేడాతో సింధు విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో తొలి సూపర్ 500 టైటిల్‌ను దక్కించుకుంది డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు. ఆసియా ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడలిస్ట్, 22 ఏళ్ల వాంగ్.. సింధు ముందు తేలిపోయింది.
తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన భారత షట్లర్.. రెండో సెట్‌ను 11-21తో కోల్పోయింది. మూడో సెట్‌ను మళ్లీ 21-15తో గెల్చుకొని.. ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సీజన్లో సింధుకు మొత్తంగా ఇది మూడో టైటిల్. ఇప్పటికే 2022లో రెండు సూపర్ 300 టైటిళ్లు గెల్చుకుంది సింధు.
ఇందులో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్ ఓపెన్ విజేతగా నిలిచింది. 58 నిమిషాల పాటు సాగిన ఈ తుది పోరులో ప్రత్యర్థిని ఓడించిన సింధు చాంపియన్ గా నిలిచింది.
News Flash: 3rd TITLE of the year for Sindhu 🔥
P.V Sindhu wins Singapore Open title after beating WR 11 Wang Zhi Yi 21-9, 11-21, 21-15 in Final.
Earlier this year Sindhu won Swiss Open & Syed Modi International (both Super 300 level tournaments). #SingaporeOpen2022 pic.twitter.com/x1XMIfkMfo— India_AllSports (@India_AllSports) July 17, 2022
బాబు పాలనలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యం: లక్ష్మీపార్వతి