మార్చి 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ భవనంలోని సభాపతి కార్యాలయంలో మరియు కమిటీ హాల్ లో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు అవాంతరాలు లేకుండా సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గతంలోని పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు కూడా త్వరగా సమాధానాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నామన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈసారి కూడా సమావేశాలలో కొన్ని నిబంధనల అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి సభ్యుడు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని..సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం ర్యాపిడ్ టెస్ట్ లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేస్తామని…ఈరోజు సాయంత్రం నుండే పరీక్షలు ప్రారంభంకానున్నట్లు తెలిపారు. పాజిటివ్ వస్తే సభ్యులు, సిబ్బంది ఎవ్వరు కూడా అసెంబ్లీ ఆవరణలోకి, సభకు రావద్దని తెలిపారు.
రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు వెనుక చంద్రబాబు హస్తం: మంత్రి పెద్దిరెడ్డి