telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Skill training for BC unemployed

తెలంగాణలో మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏసీజీఈ అధికారులు తెలిపారు. నవంబర్‌ 3-2019 తేదీన జరిగే ‘నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌’ టెస్టు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలల 8వ తరగతి చదివే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 29లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తరగతిలో జనరల్‌ విద్యార్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు పొంది ఈ సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1లక్షా 50వేలు మించకూడదని సూచించారు. జనరల్‌, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 ఫీజును చెల్లించాలని కోరారు.

Related posts