telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రేపల్లె కు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ.. నేతల హౌస్ అరెస్ట్ లు

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నకిలీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ పిలుపు ఇచ్చింది. వాస్తవాలను తెలుసుకునేందుకు రేపల్లెకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ బయలుదేరారు

మద్యం మరణాలపై నక్కా ఆనందబాబు, అశోక్‌బాబు, పట్టాభిరామ్, బుద్దా వెంకన్నలతో టీడీపీ టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కమిటీ పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇటు రేపల్లెలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే గుంటూరులో నక్కా ఆనందబాబును గృహనిర్బంధం చేశారు. రేపల్లెలో ఎటువంటి నిరసనలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Related posts