ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రులను దృష్ట శక్తులతో పోల్చిన చిట్టిబాబు నా పాలిట మంత్రులు దృష్ట శక్తులలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినదుకే నాకు మంత్రులు ఎవరూ సహకరించడంలేదని ఆయన అన్నారు. నాకు ప్రజలకు మధ్య వివేదాలు సృష్టిస్తున్నారని అయన విమర్శించారు. అయినవిల్లి మండలం శంకరాయగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రజలలో నాడు..ప్రజలకోసం నేడు కార్యక్రమంలో మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శంకరాయగూడెం సచివాలయం వివాదంలోనే మంత్రులను దుష్ట శక్తులతో పోల్చినట్టు చెబుతున్నారు. సచివాలయ వివాదంలో గ్రామస్థులకు చెప్పేలాగ వారికి చెప్పి, నాకు చెప్పేలా నాకు చెప్పి దూరాన్ని పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. శంకరాయగూడెం గ్రామానికి ఈరోజు అన్యాయం జరిగిందంటే అది మంత్రుల వల్లనే అని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చెబుతున్నారు. మరి ఈ వ్యాఖ్యల పై మంత్రులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.
కశ్మీర్ విభజనపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు